The content in this blog just for educational purposes only.We are not responsible for anything.

Recent Post

Recent Posts

Monday, July 8, 2013

మనస్సు చెప్పినట్లు మనం కాకుండా మనం చెప్పినట్లు మనస్సు వింటే అంతా హ్యాపీ హ్యాపీ హ్యాపీ... :) ;) :)

బొమ్మలు చెక్కే శిల్పి ఉండే వాడు... శిల్పాలు చెక్కడంలో తనకు తానే సాటి అన్నట్లు తాయారు చేసే వాడు ..
ఒక రాత్రి గాడ నిద్రలో ఉండగా నిద్రలో మృత్యు దేవత కనిపించి నీకు ఇవే ఆకరు రోజులు నీ కొర్కెలు ఉంటేతీర్చేసుకో.. ఒక వారంలో నువ్వు చనిపొతావు అని చెప్పింది..

టక్కున నిద్ర లేచిన శిల్పి.. ఇది నిజమా కలా అని అలోచించి.. ఒక వేళ నిజమే అయితే ఎలా అనుకున్నాడు..

అలోచించి లాభం లేదని.. తనను పోలిన శిల్పాలను వందకు పైన తయారు చేసేసాడు.. వాటి మధ్యన పడుకున్నాడు...
చెప్పినట్లుగానే మృత్యు దేవత వచ్చింది.. ఎవరు అసలు శిల్పి అని పోల్చుకోలేక పోయింది...

ఇపుడెలా అని అలోచించి...

ఇంత అద్బుత మయిన శిల్పాలను చెక్కిన శిల్పి ఎంత గొప్ప వాడు.. అతన్ని ఒక్క సారి చూడాలని ఉంది అని గట్టిగా చెప్పసాగింది...

ఇంతలో శిల్పాల మధ్యన పడుకుని ఉన్న అస్సలు శిల్పి పైకి లేచి నేనే ఆ శిల్పిని అని చెప్పడమే తొందర మృత్యు దేవత శిల్పి ప్రాణాలు తీస్కుని తన దారిలో తను వెళ్లి పోయింది...

-------> పొగడ్తలకి పడిపోతే ఇలానే ఉంటుంది మనస్సు కోతి దానికి సంతోషం వస్తే ఎమన్నా చేస్తుంది.. సమయాన్ని బట్టి స్పందించాలి...

అబ్బాయిలు అమ్మాయిలు పొగిడితే పడిపోయి దెబ్బలు తగిలాక ఆయింట్మెంట్ రాస్కోకండి... అమ్మాయిలు మీకు కూడా సేమ్ టు సేమ్.

మనస్సు చెప్పినట్లు మనం కాకుండా మనం చెప్పినట్లు మనస్సు వింటే అంతా హ్యాపీ హ్యాపీ హ్యాపీ... :) ;) :)

ఇట్లు 

U r's  RAVICHANDRA


0 comments:

Post a Comment